క్రైమ్/లీగల్

ఏడుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఏప్రిల్ 14: కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్డులో ఘోర ప్రమాదం సంభవించింది. పండగపూట చోటు చేసుకున్న ఈ విషాదం అందరినీ కదిలించివేసింది. రెండవ భద్రాద్రిగా పిలువబడే తమ్మరబండపాలెంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి ఆటోలో ఇంటికి తిరుగుపయనమైన తొమ్మిది మంది ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు మార్గమధ్యంలో మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు మార్గమధ్యంలో మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన వారిలో భార్యా భర్తలు, ఒకరు ఆటో డ్రైవర్, ఒకరు మార్కెట్‌లో పనిచేసే దినసరి కూలీ. మిగిలినా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి తీవ్రగాయాలైన వారిని చికిత్సనిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి మార్చారు. పండుగరోజు వారి కుటుంబాల్లో విషాదచ్ఛాయలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలాన్ని ఎస్పీ వెంకటేశ్వర్లు, కోదాడ శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న మృతుల కుటుంబాలకు మల్లయ్య యాదవ్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. చనిపోయిన వారి వివరాలు బేతు లక్ష్మయ్య (60), బేతు నాగ సులోచన (50), నరమనేని సుగుణ (45), వట్టికొండ శైలజ (48), అంబటి సైదమ్మ (50), లక్ష్మి (45), అబ్బాస్ (55), ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు రేణుక, మగతాయిగా నిర్ధారించినట్టు తెలిపారు.

చిత్రాలు.. కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ, * ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో