క్రైమ్/లీగల్

నరేంద్ర మోదీ బయోపిక్ చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై రూపొందిన బయోపిక్ చిత్రం విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. మోదీ బయోపిక్‌ను సంపూర్ణంగా చూసి, నిర్ణయాన్ని ఈ నెల 19వ తేదీలోగా సీల్డు కవర్‌లో అందజేయాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ మోదీ బయోపిక్ విడుదల కాకుండా ఇసీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్‌గి సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయి నేతృత్వంలోని బెంచ్ ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించి పై విధంగా ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఇచ్చే నిర్ణయాన్ని తాము ఈ నెల 22న పరిశీలిస్తామని తెలిపింది. చిత్రానికి సంబంధించిన ప్రొమో కాకుండా సంపూర్ణంగా చిత్రాన్ని చూడాలని సుప్రీం ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన బయోపిక్ చిత్రాన్ని విడుదల చేయరాదని, తద్వారా ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుంది కాబట్టి ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ మోదీ బయోపిక్‌ను విడుదల చేయరాదని బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ చిత్ర నిర్మాతలను ఆదేశించిన సంగతి తెలిసిందే. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ బయోపిక్ చిత్రం పేరును, మోదీ టైటిల్‌ను కూడా ప్రదర్శించరాదని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఈ నెల 10న వెలువడ్డాయి. ఈ నెల 11న లోక్‌సభ తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనున్నది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున చిత్రాన్ని నిర్మించరాదని కేంద్ర చలన చిత్ర నిర్మాణ బోర్డును ఆదేశించింది. మోదీ బయోపిక్ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించగా, ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.