క్రైమ్/లీగల్

కోర్టు ధిక్కరణపై రాహుల్‌కు సుప్రీం నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసు జారీ చేసింది. రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్ చేశారని, తన సొంత మాటలను ఆపాదిస్తూ సర్వోన్నత న్యాయస్థానంపై వ్యాఖ్యలు చేసినందుకుగాను దీనిని తీవ్రంగా పరిగణించింది. రాహుల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తున్న నేపథ్యంలో ఈనెల 22లోగా దీనిపై తగిన సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. బీజేపీ లోక్‌సభ సిట్టింగ్ సభ్యురాలు మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ‘రాహుల్‌గాంధీ ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల్లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఇచ్చిన తీర్పుపై మేము అనని మాటలను అన్నట్టుగా ఆపాదించిన అంశానికి సంబంధించి ఆధారాలను అన్నివిధాలా పరిశీలించాం’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల బెంచ్ పేర్కొంది. ఈ డివిజన్ బెంచ్‌లో జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. ‘రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రసంగంలో రాఫెల్‌పై చేసిన వ్యాఖ్యలను సమగ్రంగా పరిశీలించి, తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతే తగిన వివరణ కోరాం’ అని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని పేర్కొంటూ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. మీనాక్షి లేఖి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌తగి మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించినట్టుగా ఉన్నాయని పేర్కొన్నారు.
సుప్రీంకు వివరణ ఇస్తాం: కాంగ్రెస్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ చేసిన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అందిన నోటీసుకు తగిన వివరణ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్వోన్నత న్యాయస్థానం వివరణ కోరింది. మేము తగిన వివరణ ఇస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలిపారు.