క్రైమ్/లీగల్

ఆ దొరికిన నగదుపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: బ్యాంకు నుండి 8 కోట్ల రూపాయిలు విత్‌డ్రా చేసి తీసుకువెళ్తుండగా దొరికిపోయిన ఘటనలో తెలంగాణ బీజేపీ నేతలపై తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదే విధంగా పార్టీ గుర్తుతో ఓటర్ల స్లిప్‌లను పంచడంపై కూడా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈ మొత్తం వ్యవహారంపై టీఆర్‌ఎస్ ఎన్నికల ఏజెంట్ జీ పవన్‌కుమార్ గౌడ్ దాఖలు చేసిన పిటీషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ , జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డిలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. మూడు రో జుల్లో ఈ సమాచారాన్ని ఇవ్వాలని బెంచ్ ఎన్నికల కమిషన్ కౌన్సిల్ అవినాష్ దేశాయ్‌ను ఆదేశించింది. తమ పిటీషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పిటీషనర్ తరఫున న్యాయవాది మాక్ ముఖీద్ బెంచ్ దృష్టికి తెచ్చారు.
పోలీసు రిక్రూట్‌మెంట్‌లో లోపాలున్నాయా?
పోలీసు రిక్రూట్‌మెంట్ శారీరకదారుఢ్యపరీక్షల్లో లోపాలున్నాయా అని హైకోర్టు సోమవారం నాడు ప్రశ్నించింది. 23 మంది అభ్యర్ధులు పరుగుపందెంలో అర్హత సాధించలేదనే కారణంతో తమను తదుపరి శారీరక దారుఢ్య పరీక్షలకు అనుమతించలేదని పేర్కొంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంధ్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ అనుమానాలను లేవనెత్తింది. అయితే అభ్యర్ధుల అభ్యర్ధనను తోసిపుచ్చిన హైకోర్టు, తుది తీర్పునకు లోబడి మాత్రమే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.
డిజైన్ల మార్పిడిలో జోక్యం చేసుకోలేం
ప్రాజెక్టుల డిజైన్లకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. భువనగిరి - యాదాద్రి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టు కెనాల్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయవద్దని పేర్కొంటూ దాఖలైన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డిలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.