క్రైమ్/లీగల్

తమిళనాడు సర్కారుకు మద్రాస్ హైకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 15: తన కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకుగాను ఆరు నెలలు తనను సాధారణ సెలవుపై విడుదల చేయాలంటూ రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు సోమవారం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నళిని పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎం. సత్యనారాయణన్, నిర్మల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం జూన్ 11లోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. అలాగే ఇందుకు సంబంధించి ఏవైనా అత్యవసర విజ్ఞప్తులు ఉంటే వేసవి సెలవుల కోర్టును హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఆశ్రయించేందుకు నళినికి మద్రాసు హైకోర్టు స్వేచ్ఛను ఇచ్చింది. కాగా తాను గత 27 ఏళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నప్పటికీ ఎలాంటి సాధారణ సెలవులను ఇప్పటి వరకు వినియోగించుకోలేదని, ఐతే ఇప్పుడు తన కుమార్తె హరిత అలియాస్ మేఘ వివాహానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం తనకుందని నళిని తన పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. హరిత ప్రస్తుతం లండన్‌లో తన అవ్వ, తాతల వద్ద నివసిస్తోంది. ఈలోగా అవసరమైతే తనను వ్యక్తిగతంగా న్యాయస్థానంలో విచారణకు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి, జైలు అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.