క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, మార్చి 26: మండలంలోని గలిబిపల్లిలో రూప (25) అనే వివాహిత ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు గలిబిపల్లికి చెందిన రూపను అదే గ్రామానికి చెందిన శేషు వివాహం చేసుకున్నాడు. అయితే వారికి సంతానం కలుగలేదు. ఈ విషయంగా భర్త శేషుతో పాటు మామ కగ్గల్లప్ప, అత్త రామాంజినమ్మలు తరచూ రూపను వేధించేవారన్నారు. వేధింపులను తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉండగా రూప బంధువులు అత్త, మామలు, ఆమె భర్త శేషులు తమ బిడ్డను చంపి ఉరి వేశారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా పోలీసుల విచారణలో విషయం తేలాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నీటి గుంతలో పడి వృద్ధుడి మృతి
కదిరి, మార్చి 26: మున్సిపల్ పరిధిలోని ని జాంవలీ కాలనీలో కొళా యి నీటి గుంతలో పడి అజీజ్ (65) అనే వృద్ధుడు సోమవారం మృతి చెం దాడు. ప్రమాదవశాత్తు నీ టి గుంతలో పడి మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని బందువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ సహదేవరెడ్డి తెలిపారు.
అధిక లోడ్‌తో వెళ్తున్న ఆటో సీజ్
తనకల్లు, మార్చి 26: మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ వద్ద సోమవారం అధిక మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తీసుకెళ్లే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.