క్రైమ్/లీగల్

లాకప్‌డెత్ కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 16: నగర పోలీసు కమిషనరేట్‌లో లాకప్‌డెత్ ఉదంతం కలకలం రేగింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ ఓ వైపు ప్రచారం ఊపందుకోవడంతో సంచలనం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచాడని, కాదు నిందితుడు పోలీస్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ భిన్న అభిప్రాయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈదశలో పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఓ కేసులో స్టేషన్‌కు తీసుకువచ్చిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్పష్టం చేశారు. లాకప్‌డెత్ జరిగిందనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. అయితే స్టేషన్‌లో ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించామని, నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని బాసవతారకం నగర్‌లోని ఓ ఇంట్లోకి ఒక గుర్తు తెలీని వ్యక్తి మంగళవారం ఉదయం చొరబడ్డాడు. బాత్‌రూములో దూరిన వ్యక్తిని పట్టుకున్న స్ధానికులు అతని భాష అర్ధం కాకపోవడంతో తీసుకువచ్చి సింగ్‌నగర్ పోలీస్టేషన్‌లో అప్పగించారు. అతని వివరాలు కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో సిబ్బంది అల్పాహారం పెట్టారు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు పోలీస్టేషన్ వెనుక ఉన్న బాత్‌రూముకు వెళ్లి అక్కడ ఉన్న తాడుతో ఫ్యానుకు ఉరి వేసుకునే ప్రయత్నంలో గమనించిన సిబ్బంది అప్రమత్తమై రక్షించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన మీదట అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు మృతుని వివరాలు కోసం ఆరా తీస్తున్నారు. ఈ ఘటన సంచలనం రేపింది. ఓ కేసులో నిందితునిగా పట్టుకువచ్చిన పోలీసులు అతని తమదైన శైలిలో విచారించిన మీదట చనిపోయి ఉంటాడని, దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పోస్టుమార్టం అనంతరం ఘటనపై విచారణ నివేదిక అందగానే పోలీస్టేషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలుంటాయని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.