క్రైమ్/లీగల్

మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: మియాపూర్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు సేల్ డీడ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు తేలే వరకు యదాతథ స్థితి కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్వినియోగం చేసే వారి పట్ల కోర్టు కఠినంగా వ్యవహరిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. మియాపూర్ భూకుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కేసుల్లో భూములకు సంబంధించి సేల్ డీడ్‌లను రద్దు చేయడం సమ్మతం కాదని కోర్టు తప్పుబట్టింది.