క్రైమ్/లీగల్

రూ.18లక్షలు విలువచేసే గుట్కా పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 9: హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి అక్రమంగా బోలెరో వాహనంలో తరలిస్తున్న గుట్కాను మానకొండూర్ మండలం సదాశివపల్లి వద్ద శుక్రవారం టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచీ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. బోలెరా వాహన యజమాని గోదావరిఖనిలోని కళ్యాణ్‌నగర్‌కు చెందిన చిదురాల శ్యాంసుందర్ (28), కాకతీయనగర్‌కు చెందిన క్లీనర్ ఎలాపుల సంతోష్ (23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్యాంసుందర్ అనే వ్యాపారి తన బోలెరో వాహనం (టీఎస్ 22టీ 1312)లో హైదరాబాద్‌లోని హీరా ట్రేడర్స్ వద్ద 135 కాటన్ల గుట్కా సంచులను కొనుగోలు చేసి తీసుకువస్తుండగా, కరీంనగర్ నుంచి వెళ్లే పోలీసులు పట్టుకుంటారని భావించి పోలీసులకు దొరకకుండా అల్గునూర్ -మానకొండూర్- వేగురుపల్లి -సుల్తానాబాద్ మీదుగా గోదావరిఖనికి వెళ్లాలని వెళ్తుండగా, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులకు పక్కా సమాచారం అందగా, సదాశివపల్లి వద్ద మాటు వేసి పట్టుకున్నారు. అనంతరం సుమారు రూ.18లక్షలు విలువచేసే గుట్కాతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్యాంసుందర్, సంతోష్‌లపై మానకొండూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో గుట్కాను పూర్తిగా కట్టడి చేయడం జరిగిందని, ఇంకా ఎవరైన అమ్మిన, సరఫరా చేసిన సమాచారం అందించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.
రామగుండం పోలీస్‌స్టేన్ల పరిధిలో...
గోదావరిఖని: రామగుండం కమీషనరేట్ పరిధిలోని అంతర్గాం, రామగుండం పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో శుక్రవారం టాస్క్ఫోర్స్ దాడులు చేపట్టింది. సిపి విక్రమ్ జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు నిషేధిత గుట్కాల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఎసిపి విజయ సారథి ఆధ్వర్యంలో సిఐ సాగర్ దాడులు జరిపారు. అంతర్గాం మండలం కుందనపల్లి పంచాయతీ పరిధి అక్బర్ నగర్‌లోని అశ్విని కిరాణంలో దాడులు జరపగా అక్కడ 25వేల విలువ గల నిషేధిత గుట్కాలను పట్టుకున్నారు. అదేవిధంగా రామగుండం పట్టణంలోని సాయి శ్రావ్య కిరాణంలో దాడులు జరిపి అక్కడ 70వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రయాలు జరుపుతున్న సంతోష్, మల్లేష్‌లను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కాలను ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ ఐలు ప్రమోద్ రెడ్డి, రాజ్‌కుమార్‌లకు అప్పగించారు.