క్రైమ్/లీగల్

దాడులకు పాల్పడిన ఇరు వర్గాలపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్/తిరుమలగిరిసాగర్, ఏప్రిల్16: శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా ఎస్‌పీ ఏవి.రంగనాధ్ అన్నారు. మంగళవారం మండలంలోని నాయకునితండాను సందర్శించారు. ముందుగా తండాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగిన సంఘటనలో ధ్వంసమైన ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకునితండాలో భౌతిక దాడికి బాధ్యులైన ఇరుపార్టీల ప్రతి ఒక్కరిపైన, భవిష్యత్‌లో అలాంటి కార్యకాలాపాలకు పాల్పడకుండ పోలీస్ శాఖాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన శాసనసభ, గ్రామపంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలను సైతం నిర్వహించామని కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినప్పటికి, నాయకునితండాలో నాటుబాంబులు ఉపయోగించారని వచ్చిన విషయాలపై ప్రత్యేక దర్యాప్తును చేపడతామన్నారు. తండాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులు, శాంతి భద్రతల విఘాతం కలిగించిన ఎంతటివారినైన ఊపేక్షించేదిలేదని హెచ్చరించారు. చేపల వేటకు ఉపయేగించే నాటుబాంబులు, జిలెటిన్‌స్టిక్స్‌లను ప్రభుత్వ లైసెన్స్ లేకుండ వాడుతున్న వారిపై పోలీస్‌శాఖ ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆదేశీంచారు. తండాలో ధన, ప్రాణ నష్టం వాటిల్లిన ఇండ్లు, వ్యక్తుల ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి, జరిగిన ఘటనపై ఆరా తీశారు. దాడిలో ఇరువర్గాలు ఉపయోగించిన నాటుబాంబులు ఎక్కడ నుంచి వచ్చాయో వాటిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిందిస్ధాయి అధికారులకు ఆదేశీంచారు. ఆయన వెంట మిర్యాలగూడ డీస్పీ శ్రీనివాస్, సీఐలు వేణుగోపాల్, ధనుంజయగౌడ్, సురేష్, ఎస్‌ఐలు కురుమయ్య, దూది రాజా, క్రాంతికుమార్, నరేష్, మండల గిర్ధావర్ నుస్రత్‌అలీ, వీఆర్వో నాగయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
చిత్రం... బాధితుల నుంచి సంఘటన వివరాలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా ఎస్పీ రంగనాథ్