క్రైమ్/లీగల్

భర్త వేధింపులు తాళలేక భార్య అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 17: భర్త వేధింపులు తాళలేక ఓ భార్య అదృశ్యమైన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సూరారం కాలనీ, కృష్ణానగర్‌లో నివాసముండే లచ్చిరామ్, లలితాబాయి దంపతులు. లచ్చిరామ్ ప్రతిరోజు మద్యం సేవించి లలితా బాయిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు.
ఈ నెల 16న స్వగ్రామానికి వెళ్తామని చెప్పిన లచ్చిరామ్ లలితాబాయిని కొట్టాడు. దీంతో లలితాబాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. లలితా బాయి తల్లిదండ్రులు వెతకగా ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.