క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్‌కు పట్టుబడిన గంజాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.9లక్షలకు పైగా విలువ చేసే 236 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం పోలీస్టేషన్ పరిధిలోని గూడవల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ వాహనంలో సోదాలు చేయగా భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అనకాపల్లి నుంచి గంజాయిని గట్టుచప్పుడు కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఏపీ 03 టీఈ 4829 నెంబరు గల అశోకా లేలాండ్ దోస్తు వ్యానులో తరలిస్తున్న గంజాయి సరుకు గుర్తించారు. వ్యాను బాడీకి అడుగు భాగాన 9 అంగుళాలు లోతుగా ఒక చప్టాను ఏర్పాటు చేసుకుని దానిలో గంజాయిని రెండు కిలోల ప్యాకెట్‌లుగా చేసి మొత్తం 118 ప్యాకెట్లను పేర్చి దానిపై చెక్కను అమర్చి అనకాపల్లి నుంచి విజయవాడ మీదుగా గుంటూరు జిల్లా తాడేపల్లికి తరలిస్తున్నారు. సోదాలు జరిపిన టాస్క్ఫోర్స్ పోలీసులు రూ. 9,44,000 లక్షలు విలువైన 236 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన జయరామన్ సుబ్బుదేవర్ మయకృష్ణ (23), చెన్నైకి చెందిన బాలకృష్ణ బాలమురళీ (28)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కిరాయికి గంజాయి రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కేవీ శ్రీనివాసరావు, ఏసీపీ కే సూర్యచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.