క్రైమ్/లీగల్

తిరుమల ఘాట్‌లో జీపు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 17: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో వేగంగా వస్తున్న జీపు, మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో స్కూటరిస్టు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలో నివాసం ఉంటూ తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో బలరాం అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం బలరాం మోటార్ సైకిల్‌పైన తిరుమల నుండి తిరుపతికి బయలుదేరాడు. మొదటి ఘాట్‌రోడ్డులోని 34వ మలుపు వద్ద అతివేగంగా వస్తున్న జీపు బలరాం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో బలరాం రోడ్డుపై పడ్డ బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. జీపులో ప్రయాణిస్తున్న భక్తులు తెలిపిన సమాచారం మేరకు జీపు డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఈ మేరకు డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.