క్రైమ్/లీగల్

ఇద్దరు కన్నబిడ్డల్ని కడతేర్చిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, ఏప్రిల్ 17: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నడండ్రే తమ పాలిట కాలయముడవుతాడని ఆ చిన్నారులకు తెలియలేదు.. నిద్రలోనే తమ జీవితం తెల్లారిపోతుందని ఉహించలేదు. విచక్షణ కోల్పోయిన ఆ ఉన్మాది ఒక్క వేటులో పిల్లల్లో ఒకరిని కత్తితో పొడిచి చంపగా, మరొకరిని తాడుతో ఉరి బిగించి హత్య చేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్ పట్టణంలోని బాంబే కాలనీలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఎరుకల కుమార్‌కు 12 సంవత్పరాల క్రితం పటాన్‌చెరువు మండలం చిన్నకంజర్ల గ్రామానికి చెందిన శిరీషతో ప్రేమ వివాహం జరిగింది. సంవత్సరం గడిచాక భార్యాభర్తలు తరుచూ గొడవలు పడుతుండేవారు. ఇద్దరు కుమార్తెలు మల్లేశ్వరి (10),శరణ్య(4)తో పాటు కుమారుడు అఖిల్ (6) జన్మించారు. తాగుడుకు బానిపైన కుమార్ తాగి వచ్చి భార్యను పిల్లలను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండే వాడు. పిల్లలు తనకు పుట్టిన వారు కాదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ గొడవకు దిగడం ప్రారంభించాడు. ఇదే క్రమంలో గత నెలలో తాగి వచ్చి భార్యను పిల్లలను విచక్షణారహితంగా కొట్టి గాయపర్చడంతో భార్య శిరీష తన పిల్లలను తీసుకొని పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యలో భార్యను అడ్డగించిన కుమార్ ముగ్గురు పిల్లలను తీసుకొని వచ్చాడు. కాగా మంగళవారం రాత్రి శిరీష తల్లికి ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో శిరీషకు అక్రమ సంబంధాలను అంటకడుతూ దూషించాడు. త్వరలోనే శిరీషను ఆమె పిల్లలను హతమార్చుతానని హెచ్చరించాడు. రాత్రి పిల్లలు నిద్రిస్తున్న సమయంలో పదునైన చాకుతో కుమారుడు అఖిల్‌ను గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం చిన్న కుమార్తె శరణ్యను ఉరి బిగించి హత్యచేశాడు. అనంతరం పెద్ద కూతురు మల్లీశ్యరిని హత్యచేసేందుకు ప్రయత్నించగా తృటిలో ఆ బాలిక తప్పించుకొని బయటకు వచ్చి ఇరుగు పొరుగువారికి సమాచారం ఇచ్చింది. స్థానికులు వచ్చి కుమార్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఇద్దరు పిల్లలను చంపిన విషయం తెలుసుకున్న శిరీష సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించింది. ఆమె దుఖాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు.
ఉన్మాది తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం అడిషనల్ డీసీపీ ఇందిర, సీఐ రాంచందర్ తదితరులు సందర్శించి కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.