క్రైమ్/లీగల్

వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం, ఏప్రిల్ 17: ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యం వారికి అందకుండా దళారులకు వరంగా మారి రిసైక్లింగ్ చేస్తూ సుమారు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన సంఘటనన బుధవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని వేణుగోపాలపురంలో చోటుచేసుకుంది. విజిలెన్స్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజల వద్ద నుండి రేషన్ బియ్యం సేకరించి మండల పరిధిలోని వేణుగోపాలపురం- మోతే రహదారిలోని గ్రామానికి చెందిన వెల్పుల కృష్ణయ్య నిమ్మతోటలో నిల్వచేసి లారీలో తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కోదాడకు చెందిన రమేష్, వేల్పల కృష్ణయ్య, నాగన్న, నాగరాజులపై కేసునమోదు చేయాలని స్థానిక పోలీసులకు తెలిపారు. పట్టుబడిన బియ్యం కోదాడలోని స్టాక్‌పాయింట్‌కు తరలిచినట్లు తెలిపారు.