క్రైమ్/లీగల్

క్రిస్టియన్ మిచెల్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ వారం రోజుల పాటు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీలోని ఒక కోర్టు గురువారం కొట్టివేసింది. కుటుంబంతో కలిసి ఈస్టర్ వేడుకలు జరుపుకోవడానికి తాత్కాలిక బెయిలు ఇవ్వాలని కోరుతూ క్రిస్టియన్ ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ గురువారం మిచెల్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపున వాదనలు వినిపిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్.. మిచెల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. భారత్‌లో అనేక పండుగలు ఉన్నాయని, వేలాది మంది ఖైదీలు వివిధ మతాల పట్ల విశ్వాసం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిందితుడు మిచెల్ జైలులో నుంచి బయటకు వెళ్లి పండుగ జరుపుకోవడానికి అనుమతించకూడదని ఆయన కోరారు. మిచెల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూనే ఈస్టర్‌ను జరుపుకోవచ్చని సింగ్ సూచించారు. మిచెల్ తాత్కాలిక బెయిలుపై బయటకు వచ్చి, కేసుకు సంబంధించి ఏవైనా ప్రకటనలు చేస్తే, అవి దర్యాప్తును పక్కదోవ పట్టిస్తాయని కూడా సింగ్ వాదించారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసి ఉన్నందున, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదని మిచెల్ తరపు న్యాయవాది వాదించారు. నిందితుడు మిచెల్ ఈ కేసులో దర్యాప్తుకు సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.