క్రైమ్/లీగల్

ప్రైవేటు బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఏప్రిల్ 18: డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల కావేరి బస్సు బోల్తా పడిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కావేరి బస్సు మండల పరిధిలోని విలీయంకొండ సబ్‌స్టేషన్ సమీపంలో బస్సు బోల్తా పడింది. ఎపి 22 టిజెడ్ 4166 నెంబర్‌గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుండి బుధవారం రాత్రి 8.30గంటలకు బయలుదేరి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. కొత్తకోట సమీపంలోని విలీయంకొండ సబ్‌స్టేషన్ వద్ద 44వ జాతీయ రహదారిపై డ్రైవర్ ఆజాగ్రత్త వద్ద 5.30 గంటలకు రోడ్డు పక్కనే ఉన్న రెయలింగ్‌ను ఢీకొని కొంత ముందుకు వెళ్లి బస్సు బోల్తా పడింది. బస్సులో ఉన్న గౌతమ్, రవి, విజయలక్ష్మి, శ్రీనివాస్, రాఘవమోహన్‌తో పాటు ముగ్గురు చిన్నారులు స్వల్పంగా గాయపడినట్లు ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపారు. బస్సు బెంగళూరు నుండి బయలుదేరినప్పుడు బస్సు మొదటి డ్రైవర్ అయ్యప్ప డ్రైవింగ్ చేసి కర్నూల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే రెండవ డ్రైవర్ ఫిరోజ్‌కు బస్సును నడపాలని ఇచ్చినట్లు మొదటి డ్రైవర్ అయ్యప్ప తెలిపారు. విలీయంకొండ సమీపంలో ఉన్న కాల్వకు రెయలింగ్ ఏర్పాటు చేయడంతో బస్సు రెలింగ్‌ను అతివేగంగా వచ్చి ఢీకొని డ్రైవర్ అప్రమత్తమై కుడి వైపుకు తిప్పడంతో బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. 200 మీటర్ల వెనక ఉన్న కాల్వలో పడి ఉన్నట్లు అయితే పెద్ద ప్రమాదం జరిగేది. బస్సులో సుమారు 30 మంది ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నారు. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిత్రాలు.. రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన బస్సు *ప్రమాదంలో గాయపడిన చిన్నారి