క్రైమ్/లీగల్

కోర్టు ముందు హాజరుకావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బెంగలూరులో నివాసం ఉంటున్న బీ మహేష్ అనే వ్యక్తిని అరెస్టు చేయడంలో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా సోమవారం నాడు హాజరు కావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ గురువారం నాడు కర్నాటక డీజీపీని ఆదేశించింది. మహేష్ భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేష్‌ను అరెస్టు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలేదని కోర్టు ప్రశ్నించింది. తన కుమారుడు అద్యాన్‌ను అప్పగించడం లేదని పేర్కొంటూ శైలజ ఫిర్యాదు చేశారు. దాంతో మహేష్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. దానిని 15వ తేదీలోగా అమలుచేయమని కర్నాటక డీజీపీని ఆదేశిస్తూ ఆనాడు పిటీషన్‌పై విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. అయితే 18వ తేదీన సైతం కోర్టు ఆదేశాలు అమ లు కాకపోవడంతో డీజీపీ వ్యక్తిగతంగా హాజరు కావల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది.
20న హైకోర్టు భవన శతవార్షికోత్సవం
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో 20వ తేదీ సాయంత్రం హైకోర్టు భవన శతవార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులు, బార్ సభ్యులు , సీనియర్ న్యాయవాదులు , మాజీ న్యాయమూర్తులు కూడా హాజరుకానున్నారు.