క్రైమ్/లీగల్

మనస్థాపంతో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, ఏప్రిల్ 18: తన కొడుకులు తినడం లేదని వారిని కొడుతుండగా అన్న వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా కోపంలో అతని తలపై తమ్ముడు కొట్టడంతో బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, అన్నకు జరగరానిది ఏమైనా జరిగితే తన పరిస్థితి ఏమిటని భావించిన తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన మండల పరిధిలోని దుద్యాల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట శ్రీను కథనం ప్రకారం... సంఘటనకు సంభంధించిన వివరాలిలా ఉన్నాయి. కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(42) ఈనెల 12న రాత్రి తన కుమారులు సురేష్, భీమేష్ తినడం లేదనే కోపంతో వారిని కొడుతుండగా అన్న చంద్రశేఖర్ అడ్డుకున్నాడు. పొరపాటున అతని తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సాయికృష్ణ ఆసుపత్రికి తరలించారు. అన్నకు దెబ్బ తగలడంతోపాటు ఏమైన జరిగితే తన పరిస్థితి ఏమిటని ఆలోచించిన బాలరాజు.. దుద్యాల శివారులోని సంకరి రాములు పొలంలో వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకట శ్రీను పేర్కొన్నారు.