క్రైమ్/లీగల్

భార్యాభర్తల బలన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, : భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలా లేక ఆర్ధిక ఇబ్బందులే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ ప్రశాంతినగర్ స్ట్రీట్ నెంబర్ త్రీలోని వెంకటేశం ఇంట్లో నివసిస్తున్న దొరదానంద నాయుడు (44) భార్య అనిత (32) ఇద్దరు ఇంట్లో బలవన్మరణం చెందారు. ఇద్దరి మధ్యలో తలెత్తిన మనస్పర్థలా లేక ఆర్ధిక ఇబ్బందులో తెలియదు కానీ ముందుగా అనిత బెడ్‌రూంలో తలుపులు పెట్టుకుని ఆత్మహత్య చేసుకోగా ఇది చూసిన భర్త నాయుడు హాల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు మీ మరదలు లేదు. ఇక నేను కూడా వెళ్లిపోతున్నా అంటూ కోబ్రదర్‌కు ఫోన్ మెస్సేజ్ పెట్టారు. ఇది చూసుకున్న అక్క, బావ.. వచ్చి చూడగా భార్యాభర్తలు ఇద్దరి మృతదేహాలను చూసి భోరున విలపించారు.
మల్కాజిగిరిలో నివసిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన నాయుడుకు మొదటి భార్య రమ్య, 10వ తరగతి చదువుతున్న కూతురు ఉండగా ఉప్పల్ ఇందిరానగర్‌లో టైలరింగ్ చేస్తున్న అనితను ఇటీవలనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిది నెలల క్రితమే అద్దె ఇంట్లోకి వచ్చిన భార్యాభర్తలు ఆధ్యాత్మిక పూజలు చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నప్పటికీ ఆత్మహత్యకు కారణాలేమిటో తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాలను గాంధీ మార్చురికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.