క్రైమ్/లీగల్

ఉగ్ర కదలికలపై పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/రాజేంద్రనగర్, ఏప్రిల్ 20: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల సానుభూతిపరుల కదలికలపై ఎన్‌ఐఏ పంజా విసిరింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో శనివారం ఉదయానే్న హైదరాబాద్ మూడు ప్రాంతలతో పాటు మహారాష్ట్ర వార్ధా జిల్లాలో ఎన్‌ఐఎ అధికారులు ఐసిస్ అనుకూల వర్గాలపై దాడులు చేపట్టారు.అబూదబీ మోడుల్స్‌కు చెందిన ఉగ్రవాదుల ప్రేరేపిత వర్గాలుగా ని ఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఎన్‌ఐఏ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదు లు హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారంతో నగ రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఐసిస్ సానుభూతిపరుల నుంచి కీలకమైన పత్రాలను ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 13 మొబైల్స్ ఫోన్లు, 11 ఎస్‌ఎంఎస్ కార్డ్స్, ఒకటి ఐప్యా డ్, రెండు లాప్‌ట్యాప్‌లు ఒకటి హార్డు డిస్క్, 6 పెన్ డ్రైవ్‌లు, మూడు వాకీటాక్‌లు ఎన్‌ఎఐ అధికారులు చేజిక్కించుకున్నారు. సిరియా, పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర సంస్థల ప్రతినిధులు, సానుభూతిపరులు.. నగరంలో నివసిస్తుండడంతో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉగ్రకదలికల నేపథ్యంలో మైలార్‌దేవ్‌పల్లిలోని ఎనిమిది మంది ఇళ్లల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. స్థానిక కింగ్స్ ప్యాలెస్ నగర్‌లో ఉన్న తాహిర్ అనే యువకుడిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా తాహీర్‌ను మూడు గంటల పాటు విచారించారు. గతంలో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన బాసిత్, అబ్దుల్ ఖాదిర్ అనే ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన బాసిత్ ఐసిస్ సానుభూతిపరుడు. ఐసిస్‌లో చేరేందుకు సిరియా, పాకిస్థాన్ కూడా వెళ్లివచ్చాడు. తర్వాత ఐసిస్ ఆదేశాలతో దిల్లీకి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ నేతను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. తనతో పాటు మరో నలుగురు యువకులను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఏకే-47 కూడా సమకూర్చినట్లు సమాచారం. కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది. అతడి అరెస్ట్ నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాసిత్‌కు పాక్ యువతితో సంబంధాలు ఉన్నట్లు, అతడి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరి మధ్య జరిగిన చర్చ ద్వారా ప్రస్తుతం నగరంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. తాహీర్ ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
బాసిత్ అనుచరుడిగా..
ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి హత్య, ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తున్న శాస్ర్తిపురానికి చెంది న తాహీర్ అనే యువకుడిని బాసిత్ అనుచరుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఉగ్రవాది బాసిత్‌ను గతేడాది ఫిబ్రవరిలో అదుపులోకి తీసుకొ ని ఎన్‌ఐఏ విచారిస్తోంది. బాసిత్ అనుచరుడి గా, ఐసిస్ సానుభూతిపరుడిగా తాహీర్ ఉండి విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్‌ఐఏ బృందాలు గుర్తించాయి. మాడ్యూల్ చార్జ్‌షీట్‌లో బాసిత్ తెలిపిన వివరాలతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నగరంలో సుమారు ఎనిమిది మంది ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఉగ్రవాద కోణంలో తాహీర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరుడు