క్రైమ్/లీగల్

సీఎం రమేష్ మేనల్లుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, ఏప్రిల్ 20: ఇంటర్ ద్వితీయ సంవత్సరం తప్పడంతో మనస్తాపానికి గురై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ (17) ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చో టుచేసుకుంది. పోలీసులు చెప్పి న వివరాల ప్రకారం.. కడప జిల్లా పాతూరుకు చెందిన ధనుంజయ నాయుడు భార్య, పిల్లల తో కలిసి శ్రీనగర్‌కాలనీలోని వాసవీ భువన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నా డు. ధ నుంజయ నాయుడు కుమారుడు ధర్మరామ్ అమీర్‌పేట నారాయణ కాలేజీలో ఇంట ర్ ద్వి తీయ సంవత్సరం పూర్తిచేశాడు. గురువారం వచ్చిన పరీక్ష ఫలితాల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయమై తల్లి విజయలక్ష్మి, సోదరి కలసి ధర్మరామ్‌ను మం దలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మరామ్ శుక్రవారం రాత్రి తండ్రి, సోదరికి మెసేజ్ పెట్టి వారు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తునుంచి కిందకు దూకా డు. భారీ శబ్ధం రావడంతో గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న ధర్మరామ్‌ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మృతి చెందిన ధర్మరామ్ (ఫైల్)