క్రైమ్/లీగల్

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 21: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓలా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన జీ.ప్రకాష్ సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను గచ్చిబోలిలోని ప్యారడైజ్ హోటల్‌లో విధులు నిర్వహించడంతో పాటు ఓలా సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన ద్విచక్రవాహన సర్వీస్‌లో సైతం పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి హోటల్‌లో విధులు ముగించుకొన్నాడు.
అనంతరం ఓలాయాప్‌ను ఆన్‌చేసి బుకింగ్‌ల కోసం వేచి ఉండగా, సుమారు 12 గంటల ప్రాంతంలో అవినాష్ అనే వ్యక్తి సైబర్ టవర్స్ నుంచి సికింద్రాబాద్ వైపునకు బుకింగ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ప్రకాష్ అక్కడికి వెళ్లి అవినాష్‌ను ఎక్కించుకొని సికింద్రాబాద్ వైపునకు వస్తున్న క్రమంలో పంజాగుట్ట లలిత జ్యూవెలరీ వద్ద వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. తీవ్ర గాయాలపాలైన అవినాష్ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రకాష్‌కు గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన ప్రకాష్‌ను ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చెరుకు యంత్రంలో చెయ్యి పడి తీవ్రగాయాలు
* ఆసుపత్రి పాలైన నిర్వాహకుడు
బేగంపేట, ఏప్రిల్ 21: వేసవిలో చెరుకు రసం విక్రయించుకొని జీవనం కొనసాగిద్దాం అనుకున్న ఓ వ్యక్తి అదే చెరుకు యంత్రంలో చెయ్యి పడి తీవ్ర గాయాలపాలైన సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ముందు గణేష్ (35) చెరుకు బండి నడుపుతున్నాడు. ఎప్పటిలాగే చెరుకు గడలను యంత్రంలో పెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎడమ చేయి యంత్రంలోకి వెళ్లిపోయింది. దీంతో మోచేయ భుజం వరకు చక్రాల్లో నలిగి పోయింది. వెంటనే అప్రమత్తమైన సమీపంలోని వారు యంత్రాన్ని నిలిపివేసి, 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షతగాత్రునికి ప్రాథమిక చికిత్సలు అందించి అంనతరం మెరుగైన చికిత్సల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.