క్రైమ్/లీగల్

జింక విందు నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 21: తాండూరు ఫారెస్ట్ రేంజీ పరిధిలోని యాలాల మండలం భానాపూర్ గ్రామ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో శనివారం జింకను వేటాడి చంపి విందు చేసుకున్న నిందితుల ఉదంతం ఆదివారం వెలుగు చూసింది. తాండూరు అటవీ శాఖ రేంజీ అధికారులు, రేంజీ ఆఫీసర్ శ్యాంసుందర్ రావు, అటవీశాఖ ఉన్నతాధికారుల సమాచారం మేరకు సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం భానాపూర్ గ్రామానికి చెందిన బంటు శేఖర్ శనివారం గ్రామ పరిసరాల్లో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో జింకను వేటాడి చంపారు. అదే రాత్రి శేఖర్ తన ఇంటిలో జింక మాంసం వండి తన మిత్రులకు విందును ఏర్పాటు చేశాడు. ఈ సమాచారాన్ని రహస్యంగా తెలుసుకున్న తాండూరు అటవీ శాఖ రేంజీ అధికారి శ్యాం సుందర్ ఇతర సిబ్బంది.. జింకను వేటాడి చంపిన విషయం రూఢీ చేసుకొని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు భానాపూర్ గ్రామంలో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న బంటు శేఖర్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు. దాడిలో శేఖర్ జింకను వేటాడి చంపి స్నేహితులతో కలిసి విందు చేసుకున్నట్లు గుర్తించారు. దాడిలో జింక తల, కాళ్లు, చర్మం ఎముకలను అధికారుల కనుగొన్నారు.శేఖర్, అతని మిత్రులు కొందరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హజరు పరిచి జైలుకు రిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.