క్రైమ్/లీగల్

కాలువలో జారిపడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఏప్రిల్ 21: మండల పరిధిలోని పసుమర్రు గ్రామ వీరాబత్తినపురం కాలనీలో దోనే దుర్గ (28) అనే మహిళ ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పామర్రు ఎస్‌ఐ హబీబ్ బాషా తెలిపిన వివరాల ప్రకారం పుల్లేరు కాలువలోకి శనివారం సాయంత్రం బట్టలు ఉతకడానికి వెళ్లిన దుర్గ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిందన్నారు. ఆదివారం ఆమె మృతదేహం కాలువలో కనిపించటంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.