క్రైమ్/లీగల్

మొక్కజొన్న మెషీన్‌లో పడి మహిళ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, ఏప్రిల్ 21: నిత్యం మొక్కజొన్న మెషీన్‌లో మొక్కజొన్న కండెలు వేస్తూ జీవనం సాగించే మహిళకు ఆ మెషీన్ రూపంలోనే మృత్యువు కబళించింది. మొక్కజొన్నలు ఆడే షెల్డర్ (మెషీన్)లో ప్రమాదవశాత్తు మహిళ పడి దుర్మరణం పాలైన సంఘటన గుడిపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని వలసపల్లి గ్రామానికి చెందిన పల్లపోతు సీతమ్మ (38) మొక్కజొన్న మెషీన్ వద్ద పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. యధావిధిగా ఆదివారం గుడిపాడు గ్రామానికి చెందిన రైతు రాంబాబు తోటలోకి వెళ్ళింది. కొల్లి కృష్ణమూర్తికి చెందిన షెల్డర్‌తో మొక్కజొన్నలు ఆడే సమయంలో ప్రమాదవశాత్తు సీతమ్మ చీర షెల్డర్‌లోని ప్యాన్ లాగడంతో సీతమ్మ తల షెల్డర్‌లో చిక్కుకుంది. ఈసంఘటనలో సీతమ్మ తల చిధ్రమైంది. తోటి కూలీలు సీతమ్మను రక్షిద్దామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే సీతమ్మ తల మిషన్‌లో పడి చెక్కలైంది. కూలీలు ఆర్తనాదాలు చేసే లోపే సీతమ్మ దుర్మరణం పాలైంది. సీతమ్మకు భర్త బసవయ్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సంఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు. భర్త బసవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కెవిజివి సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా వైద్యశాలకు తరలించారు..