కృష్ణ

నారాయణరావు నగర్‌లో ఆరిళ్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి: చల్లపల్లి శివారు నారాయణరావునగర్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ప్రమాదంలో పేదల బ్రతుకులు బుగ్గిపాలయ్యాయి. పగలంతా పని చేసి వచ్చి ఆదమరిచి తమ గూటిలో నిద్రిస్తున్న వేళ సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా ఏడు కుటుంబాలనునడి రోడ్డున పడేసింది. శనివారం అర్ధరాత్రి 12గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదానికి గల వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణరావునగర్ కాలనీలో ఆరవ నెంబరు కాలువ వెంబడి నివశిస్తున్న ఏడు ఎస్‌టీ కుటుంబాలు నివశిస్తున్నాయి. రావూరి వెంకాయమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంకాయమ్మ ఇంటి నుండి మంటలు శరవేగంగా వ్యాపించి పక్కనున్న పొట్లూరి నాంచారయ్య, పొట్లూరి వెంకయ్య, రావూరి అంకబాబు, తలపల నాగరాజు, మానికల రామకృష్ణ, పాలకూటి శ్రీను నివాస గృహాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇల్లా లక్ష్మయ్యకు చెందిన గృహం పాక్షికంగా దగ్ధమైంది. మూడు పూరి పాకలు, మూడు రేకుల షెడ్లు ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న అవనిగడ్డ అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపు చేశారు. వీఆర్‌ఓ మత్తి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సహాయక చర్యలు నిర్వహించారు. సుమారు రూ.10లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలియచేశారు. కట్టుదిట్ట బాధితుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న తెలుగు లోగిలి సంస్థ అధినేత పేర్ల శ్రీనివాసరావు తనవంతు సాయంగా ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.3వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేశారు. తహశీల్దార్ బాధితులను పరామర్శించి తక్షణ సాయంగా 20కేజీల బియ్యం అందచేసి భోజన వసతి కల్పించారు. బాధితుల విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా షామియానాలు ఏర్పాటు చేశారు.