క్రైమ్/లీగల్

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో.. ట్రక్కు పైకి దూసుకెళ్ళిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్‌పురి (యూపీ), ఏప్రిల్ 21: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో 34 మందికి తీవ్ర గాయలయ్యాయి. ఢిల్లీ నుంచి శనివారం రాత్రి ఒక ప్రైవేటు బస్సు 41 మంది ప్రయాణికులతో వారణాసికి బయలుదేరింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు అదుపుతప్పి ట్రక్కుపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మిగతా ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. వారిని సాయిఫై ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి సీరియస్‌గా ఉందని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ప్రమాదం పట్ల ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి చెందారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాను ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించినట్లు ట్వీట్ చేశారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అజయ్ శంకర్ రాయ్ తెలిపారు.