క్రైమ్/లీగల్

సిరిసిల్లలో బాలిక కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 21: జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో 13 సంవత్సరాల విద్యార్థినిని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కిడ్నాప్ చేసిన ఉదంతంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అంబికానగర్‌లోని లయోలా ఇంగ్లీషు మీడియంలో 6వ తరతగతి చదువుతున్న ఎలుముల అంకిత (13)ను ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజశేఖర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడంతో ఈ ఉదంతం ఆందోళనకు దారి తీసింది. స్థానిక తుక్కారావుపల్లెకు చెందిన అంకిత శనివారం మధ్యాహ్నం స్నేహితురాలి వద్దకు వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీనితో తల్లి తండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్ళలో వెతికినా జాడ తెలియలేదు. అయితే సాయంత్రం 4.00 గం.కు అంకితను పాఠశాల ఉపాధ్యాయుడు రాజశేఖర్ తన బైక్‌పై బలవంతంగా తీసుకెళుతున్నట్టు అంకిత స్నేహితురాలు తగరం గేఫ్టీ సమాచారం ఇవ్వడంతో అంకిత తండ్రి ఎలుముల వెంకటేశం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 363 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసులో నిందితుడు, ఉపాధ్యాయుడు రాజశేఖర్ (ఫైల్‌ఫొటో)