క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మార్చి 26: బనగానపల్లె రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో మిట్టపల్లె గ్రామ సమీపంలోని రైలు కట్టపై వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. పశువుల కాపరులు అటుగా వెళ్తూ రైలు పట్టాలపై పడివున్న వ్యక్తి మృతదేహాన్ని బనగానపల్లెకు చెందిన చింత శ్రీనివాసరెడ్డిగా (35) గుర్తించి వారి కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, నంద్యాల రైల్వే పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీనివాసరెడ్డి మృతికి గల కారణాలు తెలియరాలేదు. రైలు లేదా గూడ్స్ వెళ్లే సమయంలో ప్రమదావశాత్తు పడ్డిపోయి తీవ్రంగా గాయపడ్డాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు వున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
హొళగుంద, మార్చి 26: మండల పరిధిలోని లింగదహళ్ళి సమీపంలో సోమవారం రెండు స్కూటర్లు ఎదురు ఎదురుగా ఢీకొని ముగ్గురికి గాయలైనట్లు ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. హొళగుంద నుండి ఐస్‌క్రీం అమ్మడానికి వెళ్తుతున్న బోయశేఖర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో శేఖర్‌తోపాటు హనుమంతమ్మ, రాఘవేంద్ర తీవ్రంగా గాయపడ్డారన్నారు. రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు