క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 22: ఒక వృద్దుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెనమలూరు గ్రామానికి చెందిన వర్రె మత్తయ్య(53) పోరంకి అక్షయ సూపర్ మార్కెట్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా చిన్నకారు వచ్చి ఢీకొంది. దీంతో గాయాలపాలైన మత్తయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. చిన్నకారు డ్రైవర్ ప్రమాదం జరగగానే అక్కడ నుండి పారిపోయాడు. సీఐ పెద్దిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.