క్రైమ్/లీగల్

మోదీ బయోపిక్ సుప్రీంకు ఈసీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై నిర్మించిన బయోపిక్ చిత్రంపై ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఇసీ) సోమవారం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ బయోపిక్‌పై ఇసీ సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయికి అందజేసింది. ఈ నివేదిక ప్రతి (కాపీ)ని చిత్ర నిర్మాతలకూ అందజేయాల్సిందిగా జస్టిస్ గొగోయి ఇసీని ఆదేశించారు. బయోపిక్ విడుదలకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈ నెల 26 నుంచి విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇక పూర్వాపరాల్లోకి వెళితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మోదీ బయోపిక్‌ను విడుదల చేయకుండా నిషేధించాలని కాంగ్రెస్‌తో సహా మరి కొన్ని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన సంగతి తెలిసిందే. దీంతో ఇసీ స్పందిస్తూ బయోపిక్‌ను విడుదల చేయరాదని నిర్మాతలను ఆదేశించింది. చివరకు చిత్ర నిర్మాతలు ఇసీ ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అందుకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి ప్రధాని మోదీపై నిర్మించిన బయోపిక్‌ను పూర్తిగా చూడాలని, కేవలం ప్రొమో, ప్రకటన (యాడ్స్)ను చూసి నిర్ణయం తీసుకోరాదని ఆదేశించారు. బయోపిక్‌ను సంపూర్ణంగా చూసి తమకు సీల్డు కవర్‌లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు బయోపిక్‌కు సంబంధించిన యాడ్స్‌ను, ప్రొమోను టీవీ ఛానళ్ళ ద్వారా ప్రసారం చేయరాదని, ప్రకటనలు ఇవ్వరాదని న్యాయమూర్తి చిత్ర నిర్మాతలను ఆదేశించారు. ప్రధాని మోదీపై రూపొందించిన బయోపిక్‌ను ఈ నెల 11న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు సంకల్పించారు. బయోపిక్ విడుదలపై కాంగ్రెస్, ఇతర పార్టీలే కాకుండా వామపక్షాలూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బయోపిక్ విడుదల వల్ల ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని అన్నాయి. దర్శకుడు ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన మోదీ బయోపిక్‌లో వివేక్ ఒబరాయ్ నటించారు.