క్రైమ్/లీగల్

ప్రాణం తీసిన ఆకతాయితనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 22: సెల్ఫీలు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినీడుకు చెందిన శివకుమార్ (26) అనే యువకుడు సరదాగా ఫోన్‌లో వీడియో తీసుకుంటూ పొరపాటున ఉరి బిగుసుకుని మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలిలావున్నాయి. శివకుమార్ స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి తిరుపతిలో మద్యం సేవించాడు. ఆపై దామినీడులో ఉన్న తన గదికి వచ్చాడు. ఏం బుద్ధి పుట్టిందో తెలియదు కాని తన గదిలో ఉన్న ఫ్యాన్‌కు గుడ్డను కట్టాడు. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో వీడియోను ఆన్ చేసి ఎదురుగా ఉంచుకున్నాడు. ఫ్యాన్‌కు కట్టిన గుడ్డ చివరి భాగాన్ని తన మెడకు బిగించుకున్నాడు.
సెల్ఫీలో తన స్నేహితులకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, బాయ్ బాయ్ అంటూ చేతులు ఊపాడు. ఆ సమయంలో నవ్వుతూ ఉన్నాడు. ఒక కాలుని మంచంపైన, మరో కాలుని ఎదురుగా ఉన్న టేబుల్‌పైన పెట్టుకుని తాను సెల్‌ఫోన్ ఉంచిన యాంగిల్‌కు అనుగుణంగా శివకుమార్ ఇలా ప్రవర్తించాడు. క్షణకాలంలో ఎదురుగా టేబుల్‌పైన ఉన్న కాలుని తీసి మంచంపై ఉంచాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న శివకుమార్ రెండు కాళ్లు కిందకు జారిపోయాయి. దీంతో ఒక్కసారిగా తాను మెడకు తగిలించుకున్న గుడ్డ గట్టిగా బిగుసుకుపోవడంతో అతి తక్కువ దగ్గరగా ఉన్న మంచంపై కూడా కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక దశలో శివకుమార్ ఉరి వేసుకున్న గుడ్డను పట్టుకొని పైకి లేవాలని ప్రయత్నించినా మద్యం మత్తు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఉరి వేసుకున్న గుడ్డ ముందు భాగానికి వచ్చి మెడను పైకి లాగింది. ఊపిరి పీల్చుకోవడానికి శివకుమార్ ఎంతో ప్రయత్నం చేసినా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మూడు నిముషాల వ్యవధిలోనే శివకుమార్ విగతజీవుడు అయ్యాడు. వీడియో కాల్‌లో చూసిన మిత్రులు శివకుమార్ ఉన్న ఇంటి వద్దకు వెళ్లారు. తలుపులు వేసి ఉండటంతో వాటిని బద్దలు కొట్టారు. అప్పటికే శివకుమార్ మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏది ఏమైనా మద్యం మత్తులో ఆకతాయితనంగా వ్యవహరించడం నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ సంఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిత్రాలు.. నవ్వుతూ వీడియో కాల్‌లో ఉన్న దృశ్యం .. పక్కనే క్షణ కాలంలో విగతజీవుడైన యువకుడు