క్రైమ్/లీగల్

గోవిందరాజ స్వామివారి కిరీటాల దొంగ దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం ఆవరణలోగల శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి ఉపాలయంలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు సంబంధించిన కిరీటాల దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఉత్సవ మూర్తులకు 1351 గ్రాముల బరువుకలిగిన రూ. 42,35,385 విలువ చేసే కిరీటాలను చోరీ చేసిన మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోడిని మంగళవారం రేణిగుంట రోడ్డు మార్గంలో గిరి వైన్‌షాప్ వద్ద ఈస్ట్‌పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ నిందితుడు చోరీ చేసిన స్వామివారి కిరీటాలను కరిగించి బంగారు అచ్చును తయారు చేసుకున్న విషయాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. జల్సాలకు అలవాటుపడిన ప్రతాప్ దొంగతనాలను వృత్తి గా ఎంచుకున్నాడన్నారు. జనవరి నెలాఖరులో తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి వచ్చి అక్కడ ఉప ఆలయంలోని ఉత్సవమూర్తులను గుర్తించి, అర్చకుల నిర్లక్ష్యంగా ఉండటం పసిగట్టి ప్రణాళిక రూపొందించుకున్నాని ఐదారుసార్లు విఫలయత్నం చేశాడు. చివరికి ఫిబ్రవరి 2న మూడు విగ్రహాల కిరీటాలను చోరీ చేసి రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి రైల్లో కాచీగూడ మీదగా నాందేడ్‌కు పరారయ్యాడని వివరించారు.
నిందితుడిని పట్టుకోడానికి సుమారు 40 మంది అధికారులతో 6 బృందాలుగా 80 రోజులు శ్రమించి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని దర్యాప్తులో జోడించి చివరకు నిందితుడిని పట్టుకోగలిగామన్నారు.