క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 24: ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....అమీర్‌పేట బిగ్‌బజార్ ఎదురుగా ఇంపాక్ట్ సొల్యూషన్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించిన సంజన- బిటెక్, ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసినవారిని ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసింది. దీంతో నిరుద్యోగ యువత కార్యాలయానికి చేరుకోగా వారి వద్ద నుంచి రూ.1500 నుంచి 2500 వరకు వసూలు చేశారు. ఇలా సుమారు 400 మంది వరకు చెల్లించారు. చాలా కాలం ఉద్యోగాలు ఇప్పించక పోవడంతో దీనిపై నిలదీయగా తప్పించుకొని తిరుగుతున్నారు. సంస్థ నిర్వాహకులపై అనుమానంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో మోహిని అనే మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిర్వాహకురాలు సంజనను సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.