క్రైమ్/లీగల్

ప్రజ్ఞా సింగ్‌పై అనర్హత కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 24: లోక్‌సభ ఎన్నికల్లో సాథ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పోటీ చేయకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌ఐఏ కోర్టు స్పందించింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ముద్దాయిగా ఉన్న ప్రజ్ఞా సింగ్ మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని నాసర్ సయ్యద్ అనే వ్యక్తి వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన లాంటి ఎంతో మందికి కడుపుకోత మిగిల్చిన ఆ సంఘటనలో కీలక నిందితురాలైన ప్రజ్ఞా సింగ్‌ను పోటీకి అనుమతించ వద్దని కోర్టును కోరాడు. భోపాల్ నుంచి కాంగ్రెస్ వెటరన్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పోటీపడుతున్న నేపథ్యంలో, ఈ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మాలేగావ్ బాధితుడు నాసర్ పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరిగింది. ఇంతకు ముందు ఇదే విషయంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. తాజాగా ఎన్‌ఐఏ కోర్టు సైతం సుప్రీం తీర్పునే అనుసరించింది. ప్రజ్ఞా సింగ్ నిందితురాలేగానీ దోషి కాదంటూ ఆమె తరఫు లాయర్ చేసిన వాదనతో ఎన్‌ఐఏ కోర్టు ఏకీభవించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించే అవకాశం లేదని తేల్చిచెప్పింది.