క్రైమ్/లీగల్

తండ్రిని చంపిన తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, ఏప్రిల్ 25: నిత్యం తాగివచ్చి ఇంట్లో గొడవచేసే తండ్రితో గొడవకు దిగాడు కుమారుడు. క్షణికావేశంలో ఇంట్లో వున్న రోకలి బండతో తలపై బాదడంతో తండ్రి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని సోలక్‌పల్లి చోటుచేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం.. సోలక్‌పల్లి గ్రామానికి చెందిన నారాయణరెడి డ(50) అనే వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవకు దిగేవాడు. గత రాత్రి సైతం మద్యం సేవించి భార్య, కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డితో గొడవకు దిగాడు. కుమారుడు తండ్రిని నిలదీశాడు. ఇరువురి మధ్య గొడవ ముదరడంతో కొడుకు ఇంట్లో ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావమై తండ్రి నారాయణరెడ్డి మృతి చెందాడు.