క్రైమ్/లీగల్

అన్న చేతిలో తమ్ముడు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 25: తన తమ్ముళ్లకు తండ్రి తరహా వాత్సల్యాన్ని పంచాల్సిన ఓ అన్న ఆ బాధ్యతను విస్మరించి తన తమ్ముడిని దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హమాల్‌వాడీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హమాల్‌వాడీకి చెందిన వౌనిక, బాబూలాల్ దంపతులకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు చౌదరి కిశోర్ కొన్నాళ్ల నుండి కూలీ డబ్బులు తల్లికి ఇవ్వకుండా తనవద్దే అట్టి పెట్టుకుంటున్నాడు. ఈ విషయమై బుధవారం రాత్రి అతనిని చిన్న తమ్ముడు చౌదరి దత్తు (23) ప్రశ్నించాడు. తామంతా పనులు చేసి తల్లికి డబ్బులు ఇస్తుంటే, నీవెందుకు ఇవ్వడం లేదని అన్నను నిలదీశాడు. పట్టరాని ఆగ్రహంతో ఇంట్లో ఆకు కూరలు తరిగేందుకు ఉంచిన పదునైన కత్తితో దత్తు కడుపులో బలంగా పొడిచాడు.