క్రైమ్/లీగల్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 25: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ కథనం ప్రకారం.. సిద్ధిపేట్ జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన పీ.శ్రీ్ధర్(35) 24న ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నగరానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రగాయాలకు గురయ్యాడు. శ్రీ్ధర్‌ను చికిత్స నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ తెలిపారు.
వంటగ్యాస్ లీక్
కొత్తూరు, ఏప్రిల్ 25: వంటగ్యాస్ లీక్ కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. గురువారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ జహంగీర్ పీర్ దర్గాకు వచ్చిన భక్తులు వంటలు చేస్తున్న సమయంలో సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన భక్తులు జహంగీర్ పీర్ దర్గాలో బాబాను దర్శించుకునేందుకు వచ్చారు. దర్గాలో వంటలు చేస్తున్న సమయంలో వంటగ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగులు తీశారు. కొంతమంది స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. దాంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్
వికారాబాద్, ఏప్రిల్ 25: అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న వాహనాలు సీజ్ చేసిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ సీతయ్య కథనం ప్రకారం.. మండల పరిధిలోని గిరిగెట్‌పల్లి గ్రామ పరిధిలో కొందరు అక్రమంగా ఎర్రమట్టి తవ్వి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, మూడు టిప్పర్ వాహనాలు సీజ్ చేశారు. జేసీబీ వాహనం స్థానిక నేత రెడ్యానాయక్‌కు చెందినదని, టిప్పర్ వాహ నం గిరిగెట్‌పల్లి మాజీ సర్పంచ్ నర్సిములుకు చెందినదని, మరో రెండు వాహనాల వివరాలు తెలియాల్సి ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.