క్రైమ్/లీగల్

మద్యం మత్తులో బాలుడిని ఎత్తుకెళ్లిన వ్యక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 25: మద్యం మత్తులో ఓ బాలున్ని ఎత్తుకెళ్లిన వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లి గ్రామంలోని ఉజ్వల వైన్స్ సమీపంలో సంవత్సరం వయసు కలిగిన బాబును మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బుధవారం రాత్రి ఎత్తుకుని తిరుగుతున్నాడు. స్థానికులు గమనించి 100కు డయల్ చేసి సమాచారం పోలీసులకు అందించారు. సంఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు తాగిన మైకంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాబును శిశువిహార్‌కు తరలించారు. గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించగా మేడ్చల్ రైలు పట్టాల సమీపంలోని గుడిసెల వద్ద ఉన్న సంవత్సరం వయస్సు ఉన్న బాబును ఎత్తుకుని వచ్చినట్లు అంగీకరించాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటప్పగా పోలీసుల విచారణలో తేలింది. అనంతరం బాబును తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.