క్రైమ్/లీగల్

సర్వం మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: చోరీకి గురైన టీఎస్ ఆర్టీసీ బస్సు నామరూపాల్లేకుండా మహారాష్టల్రోని నాందేడ్‌లో దర్శనమిచ్చింది. గౌలిగూడలోని డిపో-1లో పార్క్‌చేసిన మెట్రో బస్సును గుర్తుతెలియని వ్యృక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగలోకి దిగిన అఫ్జల్‌గంజ్ పోలీసులు డిపో పరిసరాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మెట్రో బస్సును మంగళవారం రాత్రి 12.03 గంటలకు కొందరు వ్యక్తులు డిపో నుంచి తీసుకెళ్లడం కెమెరాలో రికార్డయింది. బస్సు రంగ్‌మహాల్ హోటల్ మీదుగా నగరం దాటి నాందేడ్ వైపువెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి బస్సుకోసం గాలింపుచేపట్టారు. గురువారం నాందేడ్‌లోని ఓ షెడ్‌లో మెట్రో బస్సును కనుగొన్నారు. బస్సు ఏ పార్టుకు ఆ పార్టు విడదీసి ఉంది. వెంటనే అక్కడున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే ఉన్న మరో ముగ్గురు పోలీసులను చూసి పారిపోయారు.
బస్సును దొంగలించిన తీరు..
కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రోబస్ (ఏపీ 11జెడ్ 6254) ప్రతి రోజు కుషాయిగూడ - అఫ్జల్‌గంజ్ మధ్య నడుస్తుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11.02 గంటలకు ఆఖరి ట్రిప్ పూర్తయ్యక బస్సు డ్రైవర్ వెంకటేశం, కండక్టర్ రాహుల్ బస్సును సీబీఎస్‌లోని డిపో-1లో పార్క్‌చేశారు. డ్రైవర్ విశ్రాంతి గదికి వెళ్లి పడుకున్నాడు. బుధవారం ఉదయం లేచి చూసేసరికి బస్సు కనిపించలేదు. దానికోసం డిపోఅంతా వెదికారు. చివరికి అఫ్జల్‌గంజ్ పోలీసులకు, ఆర్టీసీ ఉన్నాతాధికారులు ఫిర్యాదు చేశారు. సీబీఎస్ ప్రధాన బస్‌స్టాప్ స్థలాన్ని కాకుండా గౌలిగూడ బస్‌డిపోను పార్కింగ్ ప్రాంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ షెడ్డు ఇటీవల కూలిపోయింది. పార్క్ చేసిన గంటలోనే ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఆర్టీసీ విజిలెన్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ రాంచధర్ రావుబస్సు కనిపించడం లేదని అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్రాలు.. నాందెడ్‌లోని ఓ ఆటోషెడ్‌లో పార్టులన్నీ తొలగించడంతో కేవలం చాసిస్‌తోనే కనిపించిన ఆర్టీసీ మెట్రో బస్సు