క్రైమ్/లీగల్

న్యాయం జరగడం లేదని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 26: తనకు న్యాయం జరుగలేదని భావించిన బాధితుడు పోలీస్‌స్టేషన్ ముందు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల్ మండలం రాస్నం గ్రామానికి చెందిన కావలి రాములు(32) భార్య పిల్లలతో కలిసి కొన్ని సంవత్సరాలుగా వికారాబాద్ పట్టణం రామయ్యగూడలో అద్దెకు ఉంటూ మేస్ర్తి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత మార్చి నెలలో చీటీ ఎత్తుకోగా రూ.53 వేలు వచ్చాయి. అదేరోజు అతని స్నేహితుడైన పూడూరు మండలం గొంగుపల్లి గ్రామానికి చెందిన కృష్ణతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో రాములు ఉండగా, అతని వద్ద ఉన్న రూ.53 వేలు కృష్ణ తీసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ విషయమై మార్చి 22న వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రాములు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో అతని స్నేహితుడు కృష్ణ రాజీకి రావడంతో.. కేసు విచారణ స్థానిక సీఐ సీతయ్య చేయలేదు. కృష్ణ ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో కొన్ని రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసి రాములు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ స్పందించి సీఐకి తిరిగి విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించించారు. సీఐ విచారణ నిమిత్తం రాములు, కృష్ణను బుధవారం పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పారు. రాములు పోలీసుస్టేషన్‌కు వచ్చినా.. కృష్ణ మాత్రం రాలేదు. తనకు న్యాయం జరగదని, పోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం లేదని భావించి రాములు.. పోలీస్‌స్టేషన్ ఆవరణలో క్రిమిసంహారక మందు తాగాడు. పోలీసులు ఇది గమనించిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి రాములు మృతిచెందాడు.
డీఎస్పీని ఆశ్రయించిన మృతుడి భార్య, పిల్లలు
కుటుంబ పెద్ద పురుగుల మందు తాగి మృతిచెందడంతో తాను, తన పిల్లలు రోడ్డున పడ్డామని మృతుడి భార్య బాలమణి, పిల్లలు శృతి, తరుణ్.. వికారాబాద్ డీఎస్పీని ఆశ్రయించారు. ఈ సంఘటనపై తగు విచారణ జరిపి, తగిన న్యాయం చేస్తానని డీఎస్పీ హామీ ఇవ్వడంతో, బాధితులు వెనుదిరిగి వెళ్లారు.