క్రైమ్/లీగల్

కూతుర్లను చంపి.. తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, ఏప్రిల్ 26: అనారోగ్యంతో భార్య మృతి చెందడం ఓ వైపు. ఆర్థిక ఇబ్బందులు మరో వైపుతో తీవ్ర మనోవేదనకు గురై.. ఓ తండ్రి మద్యం మత్తులో ఇద్దరు కుతూర్లకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటి పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపాలిటి పరిధిలోని లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్ (40) దుబ్బాక పట్టణానికి చెందిన విజయలక్ష్మితో వివాహమైంది. వీరి సంసార జీవితం సాగింది. వీరికి ఇద్దరు కూతుర్లు భవాని(9), లక్ష్మీ(5) లు ఉన్నారు. రాజేందర్ కూలీ పని చేస్తూ కూతుళ్లను పోషిస్తున్నాడు. అంత సాఫీగానే సాగుతున్న క్రమంలో భార్య విజయలక్ష్మి ఆనారోగ్యంకు గురై మృతి చెందింది. భార్య చికిత్స కోసం కొంత అప్పు చేశాడు. అయినా ఫలితం లభించలేదు. భార్య చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై మద్యానికి అలవాటు పడ్డాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తాను చనిపోతే పిల్లలకు దిక్కు ఎవరు ఉంటారని చాలా సందర్బాల్లో స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. రాజేందర్ గురువారం రాత్రి మద్యం మత్తులో తీవ్ర మనోవేదనకు గురై ఇద్దరు కూతుర్లకు ఇంట్లో ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారిన తరువాత విషయాన్ని గుర్తించిన స్ధానికులు కుటుంబికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు దుబ్బాక ఎస్‌ఐ సుభాష్ గౌడ్ సంఘటన స్ధలానికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. చిన్నారుల చేతులు వెనక్కి కట్టి ఉండటం అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఆర్ధిక ఇబ్బందుల మూలంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని మృతుడు రాసిన లేఖ ఇంట్లో లభ్యమైంది. ఎవరికి ఎంత అప్పు ఉందో వివరాలు అందులో రాశాడు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంఘటన స్ధలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆవేశానికి గురై ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. జిల్లా డిసిపి లా అండ్ ఆర్డర్ జి నర్సింహారెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ వెంకట్రామయ్య సంఘటన స్ధలాన్ని సందర్శించి ఆత్మహత్యకు గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు ఆత్మహత్య గల కారణాల గురించి దుబ్బాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.