క్రైమ్/లీగల్

రాయతీ గొర్రెలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడ, ఫిబ్రవరి 9: మండలంలోని ఎంచగూడ గ్రామం నుండి కృష్ణా జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న సబ్సిటీ గొర్రెల వాహనాలను శుక్రవారం పట్టుకొని సీజ్ చేసినట్లు డీఎస్పీ ఏ నరేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొల్లకురుమ కులస్థుల జీవనోపాధి కోసం ప్రభుత్వం సబ్సిడీలో యూనిట్ల చొప్పున (ఒక్కో యూనిట్‌కు 21) గొర్రెలను అందిస్తుందన్నారు. మధ్య దళారీలు అక్రమ సంపాదనే లక్ష్యంగా లబ్ధిదారులకు మాయమాటలు చెబుతూ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. శుక్రవారం తెల్లవారుఝామున మూడు వాహనాలలో అక్రమంగా సబ్సిడీ గొర్రెలను తరలిస్తూ పోలీసులకు పట్టబడినట్లు చెప్పారు. పట్టుబడిన వారిలో వాహనాల డ్రైవర్లు పాపగంటి వెంకటయ్య, గద్దల శ్రీను, రాంబాబులు ఉన్నారు. వ్యాపారులు కృష్ణ జిల్లా వచ్చవాయికి చెందిన కుక్కల పుల్లయ్య, గోపాల్‌రావు, షేర్ పాషాలు, మధ్య దళారీలుగా వ్యవహరించిన ఎంచగూడ గ్రామానికి చెందిన బండి కుమార స్వామి, కొమ్మన బోయిన సమ్మయ్యలు ఉన్నారన్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామన్నారు. లబ్ధిదారులు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై శాఖ పరమైన కఠిన చర్యలుతప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సబ్సిడి గొర్రెల తరలింపుపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సబ్సిడీ గొర్రెలను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న ఎస్‌ఐ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేశ్ నాయక్, ఎస్‌ఐలు సతీష్, బాలకృష్ణ, బాబురావు, సదానందం, రవి, అనిల్, యాకయ్య, కిషన్, రమేశ్‌లతో పాటు పలువరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.