క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిండి, మే 5: నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ బావివద్ద ముకురాల రాములమ్మ(50) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు రాములమ్మ భర్త నిరంజన్‌గౌడ్ తమ్ముని కొడుకు శేఖర్ కత్తితో రాములమ్మ తలపై, మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుపడిన నిరంజన్‌గౌడ్ చేతికి తీవ్ర గాయమవ్వడంతో దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.