క్రైమ్/లీగల్

మోదీ, అమిత్ షాకు..ఈసీ ఇచ్చిన క్లీన్ చిట్ రికార్డులు మాకివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియామవళి (ఎంసీసీ)ని ఉల్లంఘించలేదంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ (సిఇసీ) క్లీన్ చిట్ ఇచ్చినట్లయితే, ఆ రికార్డులను తమ ముందు ఉంచాలని సుప్రీం కోర్టు పిటీషనర్‌ను ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, సైనికుల వీర మరణం, త్యాగాల గురించి చెబుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అస్సాంలోని సిల్చార్ ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సిగ్వి పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా సోమవారం విచారణ చేపట్టారు. సైనిక దళాల త్యాగాలను ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం తగదని పిటీషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమేనని వాదించారు. ఈ విషయమై తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ చర్య తీసుకోకపోగా వారికి క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. గత నెలలో మోదీ లాతూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ పుల్వామాలో పాక్ జరిపిన దాడిలో మృత్యువాత పడిన సైనికుల త్యాగాలకు గుర్తుగా బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారని న్యాయవాది తెలిపారు. ఇలా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో సైనికుల త్యాగాలను చెబుతూ పార్టీకి అనుకూలంగా వాడుకుంటున్నారని ఆయన చెప్పారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదన్నారు. న్యాయవాది సిగ్వి వాదనను విన్న ధర్మాసనం ఎన్నికల కమిషన్ ఇచ్చిన క్లీన్ చిట్ రికార్డులను తమ ముందు ఉంచాలని, దీనికి అదనంగా అఫిడవిట్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.