క్రైమ్/లీగల్

10న విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: రాఫెల్ యుద్ధ విమానాల కేసుతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆపాదించిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలపై ఈనెల 10న విచారణ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రాఫెల్ కుంభకోణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనని వ్యాఖ్యలను రాహుల్ గాంధీ చేయడంతో దీనిని సుప్రీం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఒక ప్రత్యేక బెంచ్ గత ఏడాది డిసెంబర్ 14న దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తర్వాత ఇచ్చిన తీర్పుపై ఈనెల 10న పునఃపరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.జోసెఫ్ సభ్యులుగా ఉన్న ఈ ప్రత్యేక డివిజన్ బెంచ్ రాఫెల్ కుంభకోణంపై రివ్యూ పిటిషన్లతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సుప్రీంకోర్టును అపాదిస్తూ చేస్తూ వ్యాఖ్యలపై కూడా అదే రోజున విచారణ చేపడతామని పేర్కొంది. ‘రాఫెల్ కుంభకోణం, రాహుల్ వ్యాఖ్యలు రెండు కేసులు వేర్వేరు తేదీల్లో దాఖలైనా వాటిని ఒకేరోజున విచారణకు రావడంతో మేము ఒకింత కలవరపాటు చెందాం’ అని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలనే సుప్రీంకోర్టు కూడా పేర్కొంది అంటూ తాము అనని వ్యాఖ్యలను ఆపాదించడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. రాహుల్ తమపై చేసిన వ్యాఖ్యలపై తన వాదనలను వినిపించేందుకు వీలుగా అఫిడవిట్ దాఖలు చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం గతనెల 30వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు సుప్రీంకోర్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తప్పేనని అంగీరించారు. ఇదిలావుండగా రివ్యూ అభ్యర్థనలపై తగిన ఆధారాలతో తన వాదనలను వినిపిస్తానని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డివిజన్ బెంచ్‌కు సోమవారం స్పష్టం చేశారు. రాఫెల్ కుంభకోణం కేసుపై అనవసర ఆరోపణలు చేస్తూ కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తమ సహచర పిటిషనర్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం కోర్టు విచారణకు స్వీకరించాలని ఆయన కోరారు.