క్రైమ్/లీగల్

భగభగ మండే ఎండకు 108పాత వాహనాలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 6: ఒకప్పుడు ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాహనాలు...ఆపదలో ఉండి 108కు ఫోన్ చేస్తే కూయ్యి కూయ్యి అంటూ గల్లీలోకి వచ్చి రోగులకు ప్రథమ చికిత్స అందించి నగరంలోని ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడిన ఆ అంబులెన్స్‌లు నేడు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కాలం చెల్లిన 108 అంబులెన్స్‌లు సుమారు 60 వరకూ నిరుపయోగంగా పడి ఉన్నాయి. మేడ్చల్ రహదారి పక్కన ఉన్న జీవీకే సంస్థకు చెందిన 108 ఎమర్జెన్సీ మెడికల్ అంబులెన్స్ వాహనాలు సుమారు 60 వరకూ దగ్ధమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ట్‌షన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శామీర్‌పేట్ మండలం, దేవర యాంజాల్ గ్రామ పరిధిలో జీవీకే- ఈఎంఆర్‌ఐలో నిరుపయోగంగా సుమారు 50 నుండి 60 వాహనాలు ఉన్నాయి. మండుతున్న ఎండల వేడిమితో స్థానికంగా గడ్డి ఉండడంతో మంటలు చెలరేగి వాహనాలకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు, నల్లటి పొగలు ఎగిసిపడి సుమారు 50 నుండి 60 వాహనాలు దగ్ధమైనట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను రెండు ఫైరింజన్‌లతో వాటర్ ట్యాంకర్‌ల సహాయంతో ఆర్పివేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.