క్రైమ్/లీగల్

ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 6: నగర శివారులో దొంగలు మళ్లీ విజృంభించారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు ఇంట్లో దాచిన రూ.4.70 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం, పది తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ భవానీనగర్‌లో నివసిస్తున్న రాజు కుటుంబ సమేతంగా జగద్గిరిగుట్టలోని బందువుల ఫంక్షన్‌కు ఆదివారం రాత్రి వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇల్లు గుల్ల చేశారని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.