క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో సబ్ ఇంజినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, మే 7: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్‌లో సబ్ ఇంజినీర్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఒక రైతు పొలంలో విద్యుత్ మోటారు కనెక్షన్ ఇచ్చేందుకు 15వేల రూపాయలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్‌లో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కె శివచంద్రశంకర్‌ను మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొత్తపేట మండల పరిధిలోని వానపల్లి శివారు నారాయణలంకకు చెందిన యడ్లపల్లి పార్వతికి ఎకరా 37సెంట్ల భూమి ఉండగా ఆమె పొలంలో విద్యుత్ మోటారు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, భూగర్భ శాఖ అధికారుల నుంచి అనుమతులతో పాటు కనెక్షన్ కోసం అవసరమైన డీడీని విద్యుత్ శాఖకు సమర్పించారు. కానీ కనెక్షన్ ఇవ్వాలంటే రూ.15వేలు లంచం కావాలని డిమాండ్ చేయటంతో పార్వతి కుమారుడు యడ్లపల్లి భగవాన్ రాజమహేంద్రవరానికి చెందిన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీ ఎం సుధాకరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగి రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ ఇంజినీర్ కె శివచంద్రశంకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.